చండూరులో సైబర్ మోసం...!

నల్లగొండ జిల్లా:సైబర్ నేరగాళ్లు రోజురోజుకి వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతూ అధికారులతో పాటు, అమాయక ప్రజలను దోచుకుంటున్నారు.ఇలాంటి సైబర్ క్రైమ్ ఒకటి నల్లగొండ జిల్లా చండూరులో వెలుగులోకి వచ్చింది.

 Cyber ​​fraud In Chandur , Cyber ​​fraud , Veeramalla Nagaraju-TeluguStop.com

వీరమల్ల నాగరాజు అనే వ్యక్తికి యూనియన్ బ్యాంక్ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా లింక్ పంపించారు.ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ ఆ మెసేజ్ సారాంశంగా ఉండడంతో బ్యాంకు నుంచే వచ్చిందని బాధితుడు లింక్ ఓపెన్ చేశాడు.

దాంతో అతని వ్యక్తిగత డేటా మొత్తం పట్టేసిన సైబర్ నేరగాళ్లు రెండు దఫాలుగా అతని అకౌంట్లో నుండి రూ.లక్ష మాయం చేశారు.దీనితో లబోదిబోమంటూ బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.అవగాహన లేకుండా బ్యాంకుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని కొద్దిరోజులుగా పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నా అవగాహనా రాహిత్యంతో సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్నారని,ఎలాంటి అపరిచిత లింకులను ఓపెన్ చెయ్యొద్దని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube