కొన్ని ప్రాంతాలలో పోలీసు అధికారులు వాళ్ల వృత్తి పట్ల సరైన పద్దతిలో ఉంటూ ప్రజలకు న్యాయం కల్పిస్తూ అందిరికి మార్గ దర్శకులుగా ఉంటారు.ఇక మరికొంతమంది పోలీసులు అయితే వారి ఉన్నహోదాని చూసి ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం కూడా మనం చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం.
ఇకపోతే, తాజాగా కేరళ రాష్ట్రంలోని ( Kerala )కన్నూర్ లో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.ఒక ప్రముఖ పెట్రోల్ బంక్ ( Petrol Bunk )లో కారులో పెట్రోల్ కొట్టించుకున్న ఒక పోలీసు అధికారి అక్కడే పని చేస్తున్న ఉద్యోగిపై కార్ తో దూసుకెళ్లాడు.
అంతేకాకుండా తన కారు బ్యానెట్ పై ఆ ఉద్యోగిని ఎక్కించుకొని అలాగే ముందుకు వెళ్ళిపోయాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక కన్నూర్ సిటీ పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్( Ajith Kumar ) తెలిపిన వివరాల ప్రకారం.కేరళ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్నకె.సంతోష్ కుమార్ తన కారుకు పెట్రోల్ కొట్టించుకునేందుకు ఒక పెట్రోల్ బంక్ కు వెళ్లాడు.అయితే పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం డబ్బులు చెల్లించకుండా అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నించగా అదే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న అనిల్ అనే ఒక ఉద్యోగి కారును అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్త వివాదం చోటు చేసుకోగా.సదరు ఉద్యోగి పోలీస్ ఆఫీసర్ ను పెట్రోల్ కొట్టించుకున్నందుకు డబ్బులు చెల్లించమని అడగగా కె.సంతోష్ కుమార్ డబ్బులు ఇవ్వకుండా సదరు ఉద్యోగపై కారును పోనిచ్చాడు.ఈ క్రమంలో ఆ ఉద్యోగి కారు బ్యానేట్ పై ఎక్కేసాడు.
కారు బ్యానేట్ పై ఉన్న ఆ ఉద్యోగిని కూడా లెక్కచేయకుండా కె.సంతోష్ కుమార్ తన కారును అలాగే కిలోమీటర్ మేరకు ప్రయాణం కొనసాగించాడు.ఇక ఇందుకు సంబంధించిన సంఘటన మొత్తం అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డు అవ్వడంతో ఈ సంఘటన బయటకి వచ్చింది.ఇక ఈ ఘటనలో అనిల్ అనే ఉద్యోగికి గాయాలైనట్లు పోలీస్ అధికారులు అజిత్ కుమార్ తెలియజేశాడు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సంతోష్ కుమార్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా సంతోష్ కుమార్ సర్వీస్ నుండి సస్పెండ్ చేసినట్లు అధికారి అజిత్ కుమార్ తెలియజేశాడు.