చండూరులో సైబర్ మోసం…!

నల్లగొండ జిల్లా:సైబర్ నేరగాళ్లు రోజురోజుకి వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతూ అధికారులతో పాటు, అమాయక ప్రజలను దోచుకుంటున్నారు.

ఇలాంటి సైబర్ క్రైమ్ ఒకటి నల్లగొండ జిల్లా చండూరులో వెలుగులోకి వచ్చింది.వీరమల్ల నాగరాజు అనే వ్యక్తికి యూనియన్ బ్యాంక్ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా లింక్ పంపించారు.

ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ ఆ మెసేజ్ సారాంశంగా ఉండడంతో బ్యాంకు నుంచే వచ్చిందని బాధితుడు లింక్ ఓపెన్ చేశాడు.

దాంతో అతని వ్యక్తిగత డేటా మొత్తం పట్టేసిన సైబర్ నేరగాళ్లు రెండు దఫాలుగా అతని అకౌంట్లో నుండి రూ.

లక్ష మాయం చేశారు.దీనితో లబోదిబోమంటూ బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.

అవగాహన లేకుండా బ్యాంకుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని కొద్దిరోజులుగా పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నా అవగాహనా రాహిత్యంతో సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్నారని,ఎలాంటి అపరిచిత లింకులను ఓపెన్ చెయ్యొద్దని చెబుతున్నారు.

వారానికి 2 సార్లు ఉడికించిన శనగలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు పొందొచ్చో తెలుసా?