స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి కావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి సెలవులు( summer holidays ) ముగిసి స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరమ్మతు పనులు పూర్తి కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల, అల్మాస్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వీర్నపల్లి మండలం కంచర్ల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, గర్జనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేయనున్న మరమ్మతు పనుల ప్రణాళికను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి( Gouthami Poojari )తో కలిసి శుక్రవారం పరిశీలించారు.

 The Work Should Be Completed By The Time Schools Start-TeluguStop.com

అనంతరం ఆయా స్కూల్ లలో తరగతి గదులు, మరుగు దొడ్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

ప్రభుత్వ నిబంధనల( Government regulations ) ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగు దొడ్ల లో మరమ్మతు పనులు చేయించాలని సూచించారు.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగు నీటి వసతి కల్పించాలని ఆదేశించారు.

తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని వివరించారు.ఆయా పనులు త్వరగా మొదలు పెట్టి నాణ్యతా ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఇక్కడ టీఎస్ఈ డబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథన్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube