ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లోని పెళ్లిలను చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.జీవితంలో ఒకేసారి జరిగే సంఘటన కావడంతో ఖర్చుకు వెనకాడకుండా చాలామంది వివాహాలను( Wedding ) పెద్దపెద్ద సెట్టింగులు వేసి బంధు మిత్రులందరి సమక్షంలో జరుపుకుంటున్నారు.
అయితే పెళ్లి కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు అన్ని వెరైటీగా ఉండాలని కొత్త పోవడలకు వెళ్తున్నారు చాలామంది.ఇందులో భాగంగానే తాజాగా ఓ పెళ్లి పిలుపుకు సంబంధించిన విషయం కాస్త వైరల్ గా మారింది.
ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
తాజాగా తెలంగాణలోని ఓ వివాహం సంబంధించిన పెళ్లి కార్డు( Wedding Card ) వైరల్ గా మారింది.
ఈ పెళ్లి కార్డులో పూర్తిగా తెలంగాణ యాసను( Telangana Slang ) ఉపయోగించి వెళ్లివారు వారి బంధుమిత్రులను వివాహానికి ఆహ్వానిస్తున్నారు.ఈ పెళ్లి కార్డులో ‘ఈనెల 20న మా సిన్న కొడుకు లగ్గం.
యాదించుకొని పిల్లా, జెల్లా, ముసలి, ముత్క అందరూ వచ్చి మా పిల్లా, పిలగాన్కి దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది” అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రికను కొట్టించి.దానిని వారి బంధుమితురులకి పంచడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వీటితోపాటు ‘లగ్గం యాడనో ఎర్కన అంటూ. ప్రదేశం పేరు, తలువాలు ఏసినంక బువ్వ తినాలంటూ’ అందులో పూర్తిగా తెలంగాణ యాసలో పేర్కొన్నారు.అంతేకాకుండా పెళ్లి సందర్భంగా ‘అర్సుకునేటోళ్లు, పిలిశేటోల్ల’ పేర్లను తెలిపారు.ఇక ఈ ముచ్చటంత జగిత్యాల జిల్లా( Jagityala District ) భీమారం మండలం ఈదుల లింగంపేటకు చెందిన వెల్మల గౌతమ్ రెడ్డి, సుగుణ దంపతులు తమ చిన్న కొడుకు సతీశ్‌రెడ్డి పెళ్లి కార్డు పంచాయితీ అనమాట.పెళ్ళికార్డును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా తయారు చేయించారు కుటుంబసభ్యులు.
లగ్గం యాడనో ఎర్కన అంటూ ప్రదేశం పేరు, తలువాలు ఏసినంక బువ్వ తినాలంటూ పేర్కొన్నారు.ఈ సందర్భంగా అర్సుకునేటోళ్లు, పిలిశేటోల్ల పేర్లను తెలిపారు.జగిత్యాల జిల్లా భీమారం మండలం ఈదుల లింగంపేటకు చెందిన వెల్మల గౌతమ్ రెడ్డి, సుగుణ దంపతులు తమ చిన్న కొడుకు సతీశ్‌రెడ్డి పెళ్లి కార్డును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా తయారు చేయించారు.
పూర్తిగా తెలంగాణ యాస ఉట్టిపడేలా ” వెల్మలోళ్ల లగ్గం పిలుపు ” అంటూ పూర్తిగా తెలంగాణ యాస ఉట్టిపడేలా కార్డ్ ప్రింట్ చేయించారు.