స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పార్టీ జనసేన ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా తక్కువ సంఖ్యలో స్థానాలలో జనసేన పోటీ చేయడం గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.ఈ 21 స్థానాలలో కొన్ని స్థానాలు జనసేనకు( Janasena ) పెద్దగా బలం లేని స్థానాలు కావడం గమనార్హం.
గాజువాకలో బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీలో చేరడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
సాధారణంగా ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) బీజేపీకి, బన్నీ ఫ్యాన్స్( Bunny Fans ) జనసేనకు మద్దతు ఇస్తారని అందరూ భావిస్తారు.
అయితే కూటమి నేతలకు షాకిచ్చే దిశగా ఇద్దరు హీరోల అభిమానులు వ్యవహరించారు.బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ తో గాజువాకలో వైసీపీకి( YCP ) అనుకూల ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ఆధ్వర్యంలో గాజువాక అభివృద్ధి చెందుతుందనే భావనతో వైసీపీలో చేరినట్టు ఫ్యాన్స్ చెబుతున్నారు.
![Telugu Allu Arjun, Allu Arjun Fans, Ap, Cmjagan, Gajuwaka, Gajuwaka Ycp, Janasen Telugu Allu Arjun, Allu Arjun Fans, Ap, Cmjagan, Gajuwaka, Gajuwaka Ycp, Janasen](https://telugustop.com/wp-content/uploads/2024/04/prabhas-allu-arjun-fans-huge-shock-to-pawan-kalyan-janasena-party-detailss.jpg)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాజువాక పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే.వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా గాజువాకలో( Gajuwaka ) కూటమికి అనుకూల పరిస్థితులు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇతర హీరోల అభిమానులు సైతం గాజువాకలో గుడివాడ అమర్నాథ్ కు( Gudivada Amarnath ) మద్దతు ఇస్తే మాత్రం సులువుగానే వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది.
![Telugu Allu Arjun, Allu Arjun Fans, Ap, Cmjagan, Gajuwaka, Gajuwaka Ycp, Janasen Telugu Allu Arjun, Allu Arjun Fans, Ap, Cmjagan, Gajuwaka, Gajuwaka Ycp, Janasen](https://telugustop.com/wp-content/uploads/2024/04/prabhas-allu-arjun-fans-huge-shock-to-pawan-kalyan-janasena-party-detailsa.jpg)
నిజానికి గుడివాడ అమర్నాథ్ కు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు.అయితే జగన్ బలవంతం మేరకు గుడివాడ అమర్నాథ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం.గాజువాకలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.గాజువాకలో వైసీపీ గెలుపు కోసం సీఎం జగన్ సైతం తన వంతు కష్టపడుతున్నారని తెలుస్తోంది.