పవర్ స్టార్ పవన్ కు భారీ షాకిచ్చిన బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పార్టీ జనసేన ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా తక్కువ సంఖ్యలో స్థానాలలో జనసేన పోటీ చేయడం గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

ఈ 21 స్థానాలలో కొన్ని స్థానాలు జనసేనకు( Janasena ) పెద్దగా బలం లేని స్థానాలు కావడం గమనార్హం.

గాజువాకలో బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీలో చేరడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సాధారణంగా ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) బీజేపీకి, బన్నీ ఫ్యాన్స్( Bunny Fans ) జనసేనకు మద్దతు ఇస్తారని అందరూ భావిస్తారు.

అయితే కూటమి నేతలకు షాకిచ్చే దిశగా ఇద్దరు హీరోల అభిమానులు వ్యవహరించారు.బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ తో గాజువాకలో వైసీపీకి( YCP ) అనుకూల ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జగన్ ఆధ్వర్యంలో గాజువాక అభివృద్ధి చెందుతుందనే భావనతో వైసీపీలో చేరినట్టు ఫ్యాన్స్ చెబుతున్నారు.

"""/" / వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాజువాక పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా గాజువాకలో( Gajuwaka ) కూటమికి అనుకూల పరిస్థితులు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇతర హీరోల అభిమానులు సైతం గాజువాకలో గుడివాడ అమర్నాథ్ కు( Guada Amarnath ) మద్దతు ఇస్తే మాత్రం సులువుగానే వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది.

"""/" / నిజానికి గుడివాడ అమర్నాథ్ కు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు.

అయితే జగన్ బలవంతం మేరకు గుడివాడ అమర్నాథ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం.

గాజువాకలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

గాజువాకలో వైసీపీ గెలుపు కోసం సీఎం జగన్ సైతం తన వంతు కష్టపడుతున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తున్నాడా..?