టీడీపీ అధినేత చంద్రబాబు( N Chandrababu Naidu ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలకు పాల్పడుతుందని చంద్రబాబు ఆరోపించారు.ఈ క్రమంలోనే తమ పార్టీ నేత బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే కుట్ర జరిగిందని పేర్కొన్నారు.
తప్పు చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు.
సీఎంపై రాయి దాడి ఘటనలో తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు సింపతీ డ్రామాలకు వైసీపీ( YCP ) తెర తీసిందన్నారు.
హత్యాయత్నం అంటూ కావాలనే టీడీపీపై బురద వేయాలని చూస్తుందని ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన అధికారులను బాధ్యతల నుంచి తప్పించాలన్నారు.
అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఇతర అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.