అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున( Nagarjuna ) తను చేసిన సినిమాలు మొదట్లో వరుసగా ఫ్లాప్ అయ్యాయి.ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన శివ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నాగార్జున వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు.ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున వాళ్ళ మేనల్లుడు అయిన సుమంత్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన బాధ్యతను కూడా రామ్ గోపాల్ వర్మ మీద పెట్టడంతో ఆయన ‘ప్రేమ కథ(Prema Katha )’ అనే ఒక సినిమా చేశాడు.
ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.దానివల్ల సుమంత్ ( Sumanth )మొదటి సినిమాతో తనను తాను హీరోగా నిరూపించుకోలేకపోవడంతో ఆయన మీద అందరికీ నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది.ఇక దీనివల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు.సుమంత్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అవన్నీ ప్లాప్ అవుతూ వస్తున్నాయి.ఇక ఇటు హీరోగా కొన్ని సినిమాలు చేస్తూనే మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నాడు.ఇక రీసెంట్ గా సార్ సినిమా గాని, సీతారామం సినిమాలో గాని ఆయన చేసిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది.
ఇక ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం వారాహి( Mahendragiri Varahi ) అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇంతకుముందు సుబ్రహ్మణ్య పురం అనే ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా చేసిన సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో ఈ సినిమా చేయడం విశేషం…ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సుమంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…
.