కాంగ్రెస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కీలక అంశాలను పొందుపర్చారు.న్యాయ్ పత్ర పేరుతో రూపొందించిన మ్యానిఫెస్టోలో 5 న్యాయ పథకాలు, 25 గ్యారెంటీలను హస్తం పార్టీ ప్రకటించింది.
1.పీఎంఎల్ఏ మరియు సీఏఏ రద్దు,
2.ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్యకోసం రిజర్వేషన్లు,
3.ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల రద్దు,
4.పాత పెన్షన్ విధానం అమలు,
5.30 లక్షల ఉద్యోగాల కల్పన,
6.రూ.5000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్,
7.విద్యారుణాల వడ్డీ రేటు తగ్గింపు,
8.అగ్నివీర్ స్కీం రద్దు.ఆర్మీలో అమలులోకి పాత రిక్రూట్ మెంట్ స్కీం,
9.రూ.450 లకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ,
10.బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ,
11.రైతులకు కనీస మద్ధతు ధరపై హామీ,
12.వ్యవసాయ పరికరాల ధరల నుంచి జీఎస్టీ మినహాయింపు,
13.కులగణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన,
14.రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగింపు,
15.రైల్వేఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ,
16.రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత ,
17.స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం ఎంఎస్పీకి చట్టబద్ధత,
18.శాశ్వత వ్యవసాయ రుణమాఫీ కమిషన్ ఏర్పాటు,
19.
పంట నష్టం జరిగితే 30 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం,
20.రైతుల కోసం ఎగుమతి – దిగుమతి విధానాన్ని రూపొందిస్తాం,
21.వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ రద్దు,
22.అన్ని జిల్లా కేంద్రాల్లో సావిత్రి బాయి ఫూలే హాస్టళ్ల ఏర్పాటు,
23.మహాలక్ష్మీ హామీ కింద నిరుపేద మహిళలకు ఏటా రూ.లక్ష సాయం,
24.కేంద్ర ప్రభుత్వ కొత్త నియామకాల్లో మహిళలకు సగం హక్కులు.