టెక్నాలజీ మనిషిని నిర్వీర్యం చేస్తోంది.దాని మత్తులో పడి ఇపుడు అనేకమంది తమ జీవితాలను రిస్కులో పాడేసుకుంటున్నారు.
అవును, రీల్స్ పిచ్చితో చాలామంది యువతీ యువకులు రెచ్చిపోయి మరీ ప్రవర్తిస్తున్నారు.మరికొంతమంది రీల్స్( Reels ) కోసం తమ ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నారు.
అక్కడితో ఆగకుండా అవతలి వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేలా బిహేవ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే వెర్రీ వేషాలు వేస్తూ వైరల్ అయిన అమ్మాయిలపై పోలీసులు గతంలో అనేకసార్లు చర్యలు తీసుకున్నారు.
వారిని అరెస్టు జైల్లో కూడా పెట్టారు.అలాంటి ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) నోయిడాలో చోటు చేసుకుంది.
ఇక్కడి పోలీసులు అమలు చేస్తున్న చట్టాలను పట్టించుకోకుండా రీళ్లు చేసే వారు చాలా మంది ఉన్నారు.
తాజాగా ఫిరోజాబాద్‌లో( Firozabad ) అటువంటి ఉదంతం ఒకటి వెలుగులోకి రావడం గమనార్హం.ఇక్కడ ఓ అమ్మాయి పోలీసు ఆంక్షలు ఏమాత్రం పట్టించుకోకుండా బైక్‌పై కూర్చొని రీలు వేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్పై చర్యలు తీసుకున్నారు.ఈ అమ్మాయికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఓ వీడియోలో సదరు యువతి బైక్‌పై( Bike ) వెనక్కి తిరిగి కూర్చుని మరో బైక్ రైడర్‌తో మాట్లాడడం ఇక్కడ వీడియోలో మీరు చూడవచ్చు.మరో వీడియోలో అమ్మాయి మరో ముగ్గురితో కలిసి బైక్‌పై కూర్చొని పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మీరు గమనించవచ్చు.
మరో వీడియోలో యువతి నడిరోడ్డుపై మద్యం బాటిల్‌తో తాగి రీల్ చేస్తున్నట్లు నటిస్తోంది.
ఈ యువతికి సంబంధించినవి చాలా వీడియోలు ఇలా సోషల్ మీడియాలో వైరల్( Viral ) కావడంతో, ప్రజలు చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు యాక్టివ్ అయి రంగంలోకి దిగినట్టు సమాచారం.ఆ అమ్మాయి పేరు రుచి సింగ్.( Ruchi Singh ) ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 4 మిలియన్ల మంది వరకూ ఆమెకి పాలోవర్స్ ఉన్నారు.
ఇలాంటి ఎన్నో వీడియోలు ఈ అమ్మాయి ఖాతాలో అప్లోడ్ అయినట్టు గుర్తించారు పోలీసులు.చట్టాన్ని ఉల్లంఘించి చేసిన వీడియోకు సంబంధించి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకొని షికోహాబాద్ పోలీస్ స్టేషన్ మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఫిరోజాబాద్ పోలీసులు తెలిపారు.