ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఈ మేరకు తాడేపల్లి వైసీపీ వార్ రూమ్ లో పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తుంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ( Sajjala Ramakrishna Reddy, MP Mithun Reddy ) సమావేశం అయ్యారు.రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.
కాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేరికతో పార్టీలో మారనున్న సమీకరణాలపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే కాకినాడ లేదా పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో పవన్ కు చెక్ పెట్టేలా వైసీపీ ( YCP )వ్యూహాలు రచిస్తోంది.
అదేవిధంగా జగన్ ఎన్నికల ప్రచారంపైనా కూడా వైసీపీ నేతలు చర్చించనున్నారని సమాచారం.