యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి రూ.10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు,దుబ్బాక గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు, నీర్నెముల గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో గంగుల రాజిరెడ్డి,మల్లారెడ్డి,నర్సిరెడ్డి, రామిని రమేష్,జిల్లా వెంకటేశ్, అక్రమ్,హాజర్,క్రాంతి,జమీర్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




Latest Video Uploads News