ఇంటర్ విద్యార్థులకు నిమిషం నిబంధన సరికాదు:జాజుల లింగంగౌడ్

నల్లగొండ జిల్లా:ఇంటర్ విద్యాశాఖ అధికారుల అనాలోచిత వైఖరి విద్యార్థులకు శాపంగా మారిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధనను అధికారులు అమలు పరచడం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నదని,ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణ సందర్భంగా విధిస్తున్న ఈ నిబంధన పలువురు విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతున్నదని,దేశంలో అత్యున్నతమైన యుపిపిఎస్సీ పరీక్షలకే ఈలాంటి నిబంధనలు లేవని అన్నారు.

 Jajula Lingangaud, Minute Rule Is Not Correct For Inter Students , Jajula Lingan-TeluguStop.com

పరీక్షల నిర్వహణ వ్యవస్థ పట్ల సమాజంలో విశ్వాసం కలిగించేలా వ్యవహరించాల్సిన వారే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని,దీని వల్ల రాష్ట్రం వ్యాప్తంగా వందల మంది పరీక్షలు రాయలేదని,వెంటనే ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube