యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట( Yadagirigutta )లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి( Sri Lakshmi Narasimha Swamy )ని దర్శించు కునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

 Crowd Of Devotees In Yadadri-TeluguStop.com

స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

కాగా తెలంగాణ( Telangana )లో సుప్రసిద్ధమైన ‘యాదగిరి’ని ఒక ఆంధ్రా అయ్యోరు చెప్పిన దానికి విలువనిచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, యాదాద్రి’గా మార్చడం అప్రజాస్వామికమని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు.తెలంగాణలో ఎందరో ఆ దేవుని పేరు పెట్టుకున్న యాదగిరి’లు ఉన్నారని,ఆ దేవుని మీద గురి ఉన్నదని, పాత కృష్ణా జిల్లాలో వేదాద్రి’ ఉన్నది దాని వికృతియే ‘యాదాద్రి’ఈ వికృతి మనకెందుకు? అన్నారు.తెలంగాణ ప్రాంతీయతను ప్రతిబింబించే పురాతన, సనాతన ‘యాదగిరి’ పేరునే పున రుద్ధరించవలసిందిగా కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube