నల్లగొండ జిల్లా:నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్డు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే నల్లగొండ రూరల్ మండలం ముషంపల్లి- ధర్మాపురం వెళ్లే పద్దెనిమిది కి.మీ.
రోడ్డును 4 లైన్లుగా విస్తరించే ఫైల్ పై తొలి సంతకం చేశారు.వారం రోజుల్లోగా టెండర్ పిలిచి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోడ్డును గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రజలు,వాహన దారులు నరకయాతన పడ్డారు.ఉమ్మడి జిల్లాలోని ఇతర రోడ్లు కూడా అభివృద్ధికి నోచుకోక పోవడంతో ఎంతో కాలంగా ఇబ్బంది పడిన జిల్లా ప్రజలకు,వాహనదారులకు మంచి రోజులు రానున్నాయనే సంకేతం ఇచ్చారు.
ఇందులో భాగంగానే సింగిల్ గా ఉండి ఇన్నాళ్లుగా మరమ్మతులకు నోచుకోక అడుగడుగునా గుంతలతో అధ్వాన్నంగా మారిన నల్గొండ-ముషంపల్లి- ధర్మాపురం రోడ్డు ఇక నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరణ కానుంది.ఇప్పటి వరకు ఈ రోడ్డు మీదుగా జిల్లా కేంద్రానికి వచ్చే నిడమనూర్,కనగల్, నల్గొండ,మాడ్గులపల్లి మండలాలకు చెందిన ప్రజలు,విద్యార్థులు, ప్రతిరోజు నానా ఇబ్బందులు పడేవారు.
మార్కెట్ కు ధాన్యం తరలించాలన్నా రైతులు ఇక్కట్లకు గురయ్యేవారు.ఈ విషయాన్ని ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో గుర్తించిన కోమటిరెడ్డి ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేందుకు శ్రీకారం చుట్టారు.
నల్గొండ, ముషంపల్లి,ధర్మాపురం రోడ్డును నాలుగు లైన్లగా విస్తరించడం ద్వారా మొత్తం 50 గ్రామాలకు ఇక్కట్లు తొలగనున్నాయి.దీంతో సాగర్,నల్లగొండ నియోజకవర్గాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను హైదరాబాదుకు తరలించేందుకు ప్రయాణం సులువు కానుంది.మూడు జిల్లాలలో ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో3,621.391 కి.మీ.పొడవు రోడ్లు ఉన్నాయి.నల్లగొండ జిల్లాలో 1836.43 కి.మీ, సూర్యాపేట జిల్లాలో 907.598 కి మీ,యాదాద్రి భువనగిరి జిల్లాలో 876.363 కి.మీ.మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి.జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి కావడంతో ఏడాది,రెండేళ్లలో ఈ రోడ్ల రూపురేఖలు మారనున్నాయని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు.
సింగల్ రోడ్లు డబుల్ రోడ్డు గా,డబుల్ రోడ్డు నాలుగు లైన్లుగా విస్తరించి,ప్రజల రవాణా కష్టాలు తీరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వ్యాపారం,వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతున్నధని ప్రజలు భావిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉన్న నల్లగొండ,ధర్మాపురం రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు తొలి సంతకం చేయడంపై జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.తొలివిడతలో అభివృద్ధి చెందే రోడ్లు ఇవే.తొలి విడతలో భాగంగా నల్లగొండ,ముషంపల్లి, ధర్మాపూర్ రోడ్డుకు వంద కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.నల్లగొండ నుంచి మల్లేపల్లి వరకు,రీజినల్ రింగ్ రోడ్డు, చౌటుప్పల్ రోడ్డు ఆరు లైన్లు రోడ్డుగా,హైదరాబాద్ విజయవాడ హైవేలు విస్తరించేందుకు యోచన చేస్తున్నట్టు తెలిసింది.
అలాగే నల్లగొండ పట్టణ పరిధిలో మిగిలి ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు నకిరేకల్,నాగార్జునసాగర్ రోడ్డు అభివృద్ధి పనులను కొనసాగిస్తారు.ఇదిలా ఉంటే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని త్వరలోనే ఆరు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్ట్ ను రెండేళ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని,ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడకు అతి తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెల్లడించారు తన పార్లమెంటు సభ్యత్వాన్ని రాజీనామా చేసేందుకు ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గట్కరీతో భేటీ అయ్యి పెండింగ్లో ఉన్న 14 జాతీయ రహదారుల ప్రతిపాదనపై చర్చించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఆదివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వారంలో మూడు రోజులు సచివాలయంలో మూడు రోజులు జిల్లా పర్యటనలో ఉంటానన్నారు.
రాష్ట్రంలోని రోడ్లను మెరుగుపరిచి దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు
.