ముంబాయి వాంఖాడే స్టేడియం వేదికగా సెమీస్ లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ రసవతరంగా సాగుతోంది.మొదటి బ్యాటింగ్ కి దిగిన ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో 397 పరుగులు చేయడం జరిగింది.
కింగ్ కోహ్లీ 117 పరుగులు చేసి అత్యధిక సెంచరీ రికార్డులు కలిగిన సచిన్ రికార్డును బ్రేక్ చేసి 50 సెంచరీలతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.దీంతో కోహ్లీపై సోషల్ మీడియాలో చాలామంది స్పోర్ట్స్ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.
తాజాగా ముంబైలో జరుగుతున్న మ్యాచ్ తిలకించడానికి ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు బెక్హామ్ రావటం జరిగింది.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ 50 సెంచరీలు నమోదు చేయడంపై బెక్హామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేను సరైన సమయంలో ఇండియాలో ఉన్నాను.ఈరోజు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో నేను దీపావళిని చూశాను అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై ఇండియా గెలుస్తుందని బెక్హామ్ జోష్యం చెప్పారు.సెంచరీ అనంతరం బెక్హామ్ స్వయంగా కోహ్లీని అభినందించడం జరిగింది.విరాట్ కోహ్లీ ఈ రికార్డు అందుకున్న సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా మైదానంలోనే ఉండటం విశేషం.దీంతో సచిన్ రికార్డు బ్రేక్ చేసిన వెంటనే సచిన్ కి సలాం చేస్తూ కోహ్లీ వ్యవహరించిన తీరు మైదానంలో అందరిని ఆకట్టుకుంది.