వీడియో: భూకంపం వస్తుంటే ఈ భవనం ఎలా ఊగిపోయిందో చూడండి..

ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటనం ప్రమాదం రోజురోజుకీ రెట్టింపు అవుతోంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

 Video See How This Building Sways During An Earthquake , Iceland, Grindavik, Vol-TeluguStop.com

నైరుతి ప్రాంతంలోని తీరప్రాంత పట్టణమైన గ్రిందావిక్ నివాసితులు( Grindavik ) వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సూచించారు.ఈ ప్రాంతం శుక్రవారం నుంచి వందలాది భూకంపాలను ఎదుర్కొంటోంది, వాటిలో కొన్ని చాలా బలంగా, లోతుగా ఉన్నాయి.

ఈ ప్రకంపనలు శిలాద్రవం భూగర్భంలో కదులుతున్నదని, ఎప్పుడైనా విస్ఫోటనం చెందవచ్చని సూచిస్తున్నాయి.

గ్రిండావిక్ నుంచి పారిపోయిన వ్యక్తులలో ఒకరైన స్కాటిష్ మహిళ కైట్లిన్ మెక్లీన్ ( Caitlin McLean )ప్రియుడు గిస్లీ గున్నార్సన్‌తో( Gisli Gunnarsson ) కలిసి ఐస్‌లాండ్‌లో ఉంటోంది.భూకంపాల సమయంలో తమ ఇల్లు తీవ్రంగా వణుకుతున్న దృశ్యాన్ని వారు వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వారు ఇప్పుడు రాజధాని నగరంలోని రెక్జావిక్‌లోని అతని తల్లి ఇంట్లో ఉన్నారు.మిస్టర్ గన్నార్సన్ తన స్వస్థలాన్ని మళ్లీ చూడలేనని భయపడుతున్నానని చెప్పాడు.

అతను ఓ వార్తా సంస్థతో ఇలా అన్నాడు: “శుక్రవారం నాలుగు గంటలకు, భూకంపాలు నాన్‌స్టాప్‌గా రావడం ప్రారంభించాయి.గంటల తరబడి నిరంతరంగా పెద్ద భూకంపాలు వచ్చాయి.” అని తెలిపాడు.భూకంపాలు వచ్చే ముందు తాము అక్కడ చిక్కుకోకుండా త్వరగా నేను బయటపడ్డామని చెప్పాడు.

ఆ సమయంలో ప్రాణాలు తగ్గితే చాలని, ఏవీ తముతో పాటు తెచ్చుకోకుండా బయటికి వచ్చామని వెల్లడించారు.తమ ఇంటిని ఇకపై చూడకపోవచ్చు నీ అతడే ఎమోషనల్ కామెంట్ చేశాడు.

ఐస్‌లాండిక్ మెటీయోరోలాజికల్ ఆఫీస్, సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.శిలాద్రవం ఉపరితలం దగ్గరకు చేరుతోందని చెప్పడానికి ప్రస్తుతానికైతే ఎలాంటి సంకేతాలు కనిపించలేదని , అయితే అది త్వరగా మారవచ్చని వారు చెప్పారు.

ఐస్‌ల్యాండ్ ఒక అగ్నిపర్వత ద్వీపం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube