తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో, కమెడియన్, విలన్ సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట కమెడియన్ గా కెరియర్ ను మొదలుపెట్టిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.
కానీ హీరోగా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గా పలు సినిమాలలో నటించారు.అయితే ఈ మధ్యకాలంలో సునీల్ సినిమాలలో విలువనుగా నటిస్తూ నేర్పిస్తున్న విషయం తెలిసిందే.
అలా ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ( Sunil )ఆ తర్వాత హీరోగా ఒకటి రెండు సినిమాలలో నటించి మెప్పించారు.
![Telugu Gnana Sagar, Harom Hara, Poster, Pushpa, Sudheer Babu, Sunil, Tollywood-M Telugu Gnana Sagar, Harom Hara, Poster, Pushpa, Sudheer Babu, Sunil, Tollywood-M](https://telugustop.com/wp-content/uploads/2023/11/sunil-harom-hara-movie-poster-release-tollywood-Sudheer-Babu.jpg)
ఇప్పుడు విలన్ పాత్రలో నటించి విలన్ గా కూడా నటించగలను అని నిరూపించుకున్నారు సునీల్.ముఖ్యంగా పుష్ప సినిమాలో( Pushpa movie ) విలన్ పాత్రలో అద్భుతమైన నటనను కనపరిచాడు.పుష్ప సినిమాలో సునీల్ విలనిజం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఒకప్పుడు ప్రేక్షకులు ఏ ఫేస్ చూసి అయితే నవ్వుకున్నారో ఇప్పుడు అదే ఫేస్ ని చూసి భయపడుతున్నారు.ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరోలకు విలన్ అంటే సునీల్ కరెక్ట్ అన్న విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా సునీల్ మరో హీరోకి విలన్ గా మారాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరోం హర.( Harom hara movie )
![Telugu Gnana Sagar, Harom Hara, Poster, Pushpa, Sudheer Babu, Sunil, Tollywood-M Telugu Gnana Sagar, Harom Hara, Poster, Pushpa, Sudheer Babu, Sunil, Tollywood-M](https://telugustop.com/wp-content/uploads/2023/11/sunil-harom-hara-movie-poster-release-tollywood-Sudheer-Babu-Gnana-Sagar.jpg)
జ్ఞాన సాగర్ దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న సినిమాలో సునీల్ విలన్( Sunil ) గా నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి సునీల్ కు సంబంధించిన పశువులకు పోస్టర్ ని విడుదల చేశారు.ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.పోస్టర్ లో సునీల్ పక్కన గన్స్,బుల్లెట్స్ చూపించి విలనిజాన్ని మరింత పెంచుతూ పవర్ మరింత పెంచేశారు.