యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో( Hamirpur District ) ఓ వింత ఘటన వెలుగు చూసింది.ఇక్కడ ఒక పెంపుడు కుక్క( Pet Dog ) ఒకేసారి 9 కుక్కపిల్లలకు జన్మనిచ్చింది.
ఈ ఆనందంలో కుక్క యజమానురాలు ఊరు అందరికీ గ్రాండ్‌గా పార్టీని ఇచ్చారు.తాము ఎంతగానో ఇష్టపడే పెంపుడు కుక్క 9 మంది పిల్లలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగి తేలింది.
మేరాపూర్ ప్రాంతంలో జరిగింది.
రాజ్‌కాళి( Rajkali ) అనే మహిళ ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటోందిత.
దానికి ‘చట్నీ’ అని పేరు పెట్టింది.ఆ కుక్క ఇటీవల 9 కుక్క పిల్లలకు జన్మనిచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె వేడుక నిర్వహించింది.
గ్రామంలోని ప్రజలందరినీ విందుకు ( Dinner ) ఆహ్వానించింది.ఆతిథ్యం కోసం పూరీలు, భోజనం, మిఠాయిలు సిద్ధం చేశారు.
మహిళలు డప్పులు, తాళాలతో సోహార్ పాటలు పాడారు.ఈ సీన్ చూసిన వారందరూ షాక్ అయ్యారు.
ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
మేరాపూర్‌లోని వార్డ్ నెం.10లో నివాసం ఉండే రాజ్‌కాళికి తన పెంపుడు కుక్క ‘చట్నీ’( Chatni ) అంటే చాలా ఇష్టం.చట్నీ గత వారం వివిధ రంగులలో తొమ్మిది కుక్కపిల్లలకు జన్మనిచ్చింది.
ఆ కుక్క పిల్లలన్నీ( Puppies ) ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయి.ఇంతకు ముందు పుట్టిన కుక్క పిల్లలు పెద్దయ్యే లోపే చనిపోయాయి.
అయితే చట్నీని మాత్రం రాజకాలి అపురూపంగా పెంచుకుంది.ఈ కుక్కను తన ఇంట్లో ఉంచుకున్నప్పటి నుంచి తన కష్టాలు చాలా వరకు దూరమయ్యాయని రాజ్‌కాలి చెప్పింది.
చట్నీ ఏకకాలంలో తొమ్మిది కుక్కపిల్లలకు జన్మనివ్వడం తమను సంతోషానికి గురి చేసిందని పేర్కొంది.సాధారణంగా ఒక కుక్క 4 నుండి 6 కుక్కపిల్లలకు మాత్రమే జన్మనిస్తుంది.
అయితే తమ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ చట్నీ 9 కుక్క పిల్లలకు జన్మనిచ్చిందని రాజ్‌కాళి ఆనందంగా చెప్పింది.ఆమె ఇచ్చిన విందులో నాలుగు వందల మందికి పైగా పాల్గొన్నారు.బుధవారం సాయంత్రం నుంచే అతిథుల రాక ప్రక్రియ ప్రారంభమైంది.ఆ రోజు అర్థరాత్రి వరకు వేడుక చాలా సందడిగా జరిగింది.మహిళలు సోహర్ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.పెంపుడు కుక్క ‘చట్నీ’ని అందంగా అలంకరించారు.
మహిళలంతా ఆ పెంపుడు కుక్కతో సెల్ఫీలు దిగారు.