టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.
ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై నమోదైన కేసులో పీటీ వారెంట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ వేసిన సీఐడీ చంద్రబాబును విచారించాలని గతంలో కోరిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలోనే అలైన్ మెంట్ మార్పు కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొంది.