సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన కార్తీ ( Karti )ఒకరు.ఈయన ఇప్పటికే చాలా సినిమాలు చేసి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రస్తుతం కార్తీ జపాన్ అనే సినిమా చేస్తున్నాడు అందులో భాగంగానే ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం జరిగుతుంది.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల పైన ప్రేక్షకులకు మంచి అంచనాలున్నాయి.ఎందుకంటే ఈయన వైవిధ్యమైన కథంశాలను ఎంచుకొని డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న కథలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంతున్నాడు.
నిజానికి కార్తీ ఖైదీ సినిమాతో చాలా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
![Telugu Karthi Telugu, Indragantimohan, Japan, Karthi, Tollywod-Movie Telugu Karthi Telugu, Indragantimohan, Japan, Karthi, Tollywod-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Hero-Karthi-in-the-direction-of-Telugu-star-directora.jpg)
అలాగే నటన పరంగా కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి.ఇంకా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన వరుసగా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేసిన జపాన్ ( Japan )అనే సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది.
ఇక ఈ క్రమంలో ఆయన ఎంతవరకు ఈ సినిమాతో ఆకట్టుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇంతకుముందు తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని నిరశ పరిచినప్పటికీ ఆయనకి తెలుగులో మాత్రం మార్కెట్ బాగా ఉందనే చెప్పాలి.
సూర్యతో సమానంగా కార్తీ తెలుగు లో మంచి విజయాలు అందుకుంటున్నారు.అయితే కార్తీ తన నెక్స్ట్ సినిమాని తెలుగు డైరెక్టర్ అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణతో( Indraganti Mohan Krishna ) చేయబోతున్న టాక్ వినిపిస్తుంది.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయి.అటు క్లాస్ కి, మాస్ కి మధ్యలో ఉంటాయి.కాబట్టి ఆయన సినిమాలు అందరికీ నచ్చుతాయి…అందుకే ఆయన చేసిన సినిమాలు కూడా చాలా బెస్ట్ సినిమాలు గా పేరు కూడా సంపాదించుకున్నాయి…మరి కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి…