ఏపీలో ఎవరు ఎంతమంది ?  కుల లెక్కలు తేల్చే పనిలో ఏపీ ప్రభుత్వం 

ఎన్నో సంవత్సరం ముందు జరిగిన కుల గణన ను ఏపీలో ఇప్పుడు చేపట్టాలని అధికార పార్టీ వైసిపి( YCP ) భావిస్తోంది.ప్రజలందరిని ఆర్థికంగా,  సామాజికంగా,  విద్యాపరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది.

 How Many People Are There In Ap? Ap Government Is In The Process Of Calculating-TeluguStop.com

దీనిలో భాగంగానే ఏపీలో  కుల గణన చేపట్టేందుకు వైసిపి ప్రభుత్వం నిర్ణయించుకుంది.  ఇప్పటికే కుల గణన కోసం గత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం.

దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కుల గణన ఏ విధంగా జరిగిందో అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీని కూడా నియమించింది.ఇప్పటికే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది.కమిటీ నివేదిక ఆధారంగా కుల గణన ఏ రకంగా చేపట్టాలని విషయం పైన వివిధ విధానాలను ఏపీ ప్రభుత్వం( AP Govt ) సిద్ధం చేస్తుంది.92 సంవత్సరాల తర్వాత కులాల వారీగా లెక్కలను బయటకు తీసే పనుల్లో వైసిపి ప్రభుత్వం నిమగ్నం అయ్యింది.

Telugu Ap, Ap Cm Jagan, Ap Kula Ganana, Apchelluboina, Jagan, Welfare Schemes, Y

దేశంలో చివరిసారిగా 1931 లో సమగ్ర కుల గణన చేపట్టారు.అప్పటి నుంచి ఉన్న లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కానీ , సంక్షేమ పథకాలు( Welfare schemes ) గాని,  కులాల వారిగా ఉన్న జనాభాను గానే అంచనా వేసుకుంటూ వస్తున్నారు.దీని కారణంగా అట్టడుగు బలహీన వర్గాలకు పథకాలు మెరుగ్గా అందడం లేదని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది.అప్పటి నుంచి సమగ్రమైన లెక్క లేదని,  అందుకే కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

దీని ద్వారా అణగారిన వర్గాలకు మరింతగా భద్రత కల్పించవచ్చని,  కులాలవారీగా పూర్తి వివరాలు తెలిపితే ఏ కులం ప్రజలు ఇంకా ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారు… వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై క్లారిటీ వస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Telugu Ap, Ap Cm Jagan, Ap Kula Ganana, Apchelluboina, Jagan, Welfare Schemes, Y

ఈ మేరకు ఈనెల 20 తర్వాత నుంచి కుల గణన ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటుంది .దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది .ఈ కార్యక్రమానికి కుల సంఘాలను కూడా ఆహ్వానించాలని , వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube