సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రసీమలో మోస్ట్ పాపులర్, మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అని చెప్పవచ్చు.వీరిద్దరూ అనేక పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే చిరంజీవి( Chiranjeevi ) కంటే ముందే స్టార్ అయిపోయిన కృష్ణ, చిరంజీవి సినిమాని కూడా నిర్మించాడన్న విషయం మీకు తెలుసా? ఆ సినిమా ఆషామాషీ సినిమా కాదు, తెలుగు చిత్ర పరిశ్రమనే మార్చిన సినిమా అది.
ఆ వివరాల్లోకి వెళితే, ఖైదీ చిత్రం( Khaidi Movie ) 1983లో విడుదలైంది.దీనికి కోదండరామి రెడ్డి( Kodanda Ramireddy ) దర్శకత్వం వహించారు.
ఇందులో చిరంజీవి జైలు నుండి తప్పించుకుని స్మగ్లర్ల ముఠాపై పోరాటంలో పాల్గొన్న ఖైదీగా నటించాడు.ఈ సినిమాలో చిరంజీవి జెట్ స్పీడ్ డ్యాన్స్‌లు, ఫైట్లు తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
చిరంజీవికి ఇది తొలి కమర్షియల్ హిట్ కావడమే కాకుండా స్టార్ హీరోగా నిలబెట్టింది.
అయితే ఖైదీ తెలుగులోనే కాదు, 1984లో హిందీలో ఖైదీ(Qaidi)గా రీమేక్ చేయబడింది.ఈ హిందీ రీమేక్ నిర్మాత మరెవరో కాదు, మన సూపర్ స్టార్ కృష్ణ.( Superstar Krishna ) ఆయన పద్మాలయా స్టూడియో బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాడు.
హిందీ వెర్షన్‌లో చిరంజీవి పాత్రను జితేంద్ర( Jithendra ) పోషించగా, మాధవి హీరోయిన్‌గా నటించింది.సుమలత పాత్రను హేమమాలిని( Hema Malini ) పోషించగా, రంగనాథ్‌గా శతృఘ్నసిన్హా నటించారు.
పోలీస్ ఆఫీసర్‌గా శతృఘ్నసిన్హా కనిపించాడు.రావుగోపాలరావు విలన్ పాత్రను ఖాదిర్ ఖాన్ పోషించాడు.
ఎస్.ఎస్.రవి చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది.సూపర్ స్టార్ కృష్ణకు నిర్మాతగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
ఇలా చూసుకుంటే కృష్ణ చిరంజీవి తీసిన ఖైదీ మూవీ హిందీ రీమేక్ ను ప్రొడ్యూస్ చేశాడు.అయితే చిరంజీవి మూవీని కృష్ణ రెడీ చేశారని చాలామంది అంటారు ఆ మూవీ ఖైదీ రీమేక్( Khaidi Hindi Remake ) అని ఇప్పటికీ చాలామంది అభిమానులకు తెలియదు.ఇకపోతే ఈ మూవీ ఒక్కటే వారి కెరీర్‌ను, తెలుగు చిత్ర పరిశ్రమను మార్చింది.రీమేక్ అంటే సాధారణంగా అసలు కథను విభిన్న ప్రేక్షకులకు, సంస్కృతికి అనుగుణంగా మార్చడం.
కానీ హిందీ ఖైదీ దాదాపుగా తెలుగు ఖైదీకి కాపీ ఉంది.డైలాగులు, పాటల్లో మాత్రమే స్వల్ప మార్పులు చేశారు.