అవును, మీరు విన్నది నిజమే.అండ్రాయిడ్ యూజర్ల కోసం జీమెయిల్ లో ఓ అద్బుత ఫీచర్ ను గూగుల్ ( Google )తాజాగా ఆవిష్కరించింది.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఎమోజీల ద్వారా వినియోగదారులు ఎలా అయితే రిప్లై ఇస్తారో, అదే మాదిరి జి మెయిల్( Gmail ) లో కూడా ఎమోజీని ఇకనుండి వాడుకోవచ్చు.అవును, ఎమోజీ ద్వారా జిమెయిల్ లోని ఈమెయిల్‌లకు రిప్లై ఇచ్చే సదుపాయాన్ని గూగుల్ అందుబాటులోకి తేవడంతో వినియోగదారులు ఖుషీ అవుతున్నారు.
గూగుల్ జిమెయిల్ లో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ఫీచర్ తో ఎమోజీతో ఇమెయిల్‌లకు రెస్పాండ్ అవ్వొచ్చన్నమాట.
వాస్తవానికి ఈ సమాచారం ఆపల్ పరికరాల్లోని జిమెయిల్ యాప్‌లో కనిపించే దాచిన కోడ్‌లో కనిపించింది.జీమెయిల్ లాగిన్ అయిన సమయంలో సందేశం దిగువన ఎమోజీ కనిపిస్తుంది.మెను నుండి మీ ఎమోజీని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఇక ఆ తరువాత మీకు నచ్చిన దానిని సెలక్ట్ చేసుకొని ఎవరికైతే పంపాలని అనుకుంటున్నారో వారికి పంపండి.సోషల్ మీడియా పోస్ట్‌లకు ప్రతిస్పందించడానికి మనలో చాలా మంది ఎమోజీని ఎలా ఉపయోగిస్తారో అదే ఫీచర్ లాగా జీమెయిల్ ఎమోజీ ఉంటుందని మీకు వాడితే అర్ధం అయిపోతుంది.
అవును, ఆపిల్ యొక్క ఐ మెసేజ్ లు( i messages ) ఐఓయస్ లో ఎలా ఉపయోగపడతాయో అదే విధంగా, జిమెయిల్ లో ఎమోజిలు పని చేస్తాయి.జీమెయిల్ ఎమోజీ ఉపయోగించే సమయంలో మరికొన్ని ఆంక్షలు కూడా వుంటాయని గుర్తు పెట్టుకోవడం ఎంతైనా అవసరం.స్కూల్ లేదా ఆఫీసు జీమెయిల్ లో ఎమోజిని పంపే వీలు లేదు.అదేవిధంగా ఎమోజీలను 20 మంది కంటే ఎక్కువ వ్యక్తులకు పంపలేరు.అదేవిధంగా గ్రూప్స్ ఈమెయిల్‌లలో వినియోగదారుడు కొన్ని ఇతర నిర్దిష్ట పరిస్థితులలో ఎమోజిలను పంపలేరు.