టాలీవుడ్ ఇండియా హీరో అల్లు అర్జున్, సుకుమార్( Allu Arjun, Sukumar ) కాంబినేషన్ లో 2021లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ ల సునామీని సృష్టించింది.
ఈ సినిమాలోని పాటలు డైలాగులు మేనరిజాలు సినిమా విడుదల అయ్యి సంవత్సరం అయినా కూడా ప్రేక్షకులు మరిచిపోలేదు.కాగా పుష్ప సినిమా విడుదల అయ్యి ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ ని మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు.
చిన్న పెద్ద సెలబ్రిటీలు సామాన్యులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమయం సందర్భం బట్టి ఈ డైలాగ్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు.అయితే ఆ సంగతి పక్కన పెడితే గతంలో అల్లు అర్జున్ చేసిన సినిమాల పాటలు డాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్( David Warner ) బన్నీ అలవైకుంఠపురంలో సినిమా సమయంలో వార్నర్ ఆ మూవీ పాటలకు స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు.ఇక ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్దమవుతున్న క్రమంలో పుష్ప మేనరిజంలో తగ్గేది లేదు అని అర్థం వచ్చేలా సైగలు చేయడం హాట్ టాపిక్ అయింది.
హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్( Australia, Pakistan ) జట్లు ప్రాక్టీస్ మ్యాచులో తలపడగా ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా.వార్మప్ మ్యాచ్ లు కూడా సాధారణ మ్యాచ్ ల లానే జరుగుతున్నాయి.ఈ మ్యాచ్ లోనే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ బాల్ ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుకుని ఆ తరువాత తగ్గేదేలే అని అంటూ మేనరిజం చేసి చూపించడం గమనార్హం.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోని బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.