యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) కు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట గత రెండు రోజులుగా తెగ వైరల్ అవుతుంది.అంతగా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలో తారక్ ఒక చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఫోటో ఇది.ఈ పిక్ క్షణాల్లోనే వైరల్ గా నిలిచింది.
మరి తారక్ అంత ప్రేమగా ఆడుకుంటున్న ఈ చిన్నారి పాప ఎవరు ఏంటి అనేది నెట్టింట ఫ్యాన్స్ కూడా తెగ చర్చించు కుంటున్నారు.మరి ఆ చిన్నారి గురించి సమాచారం తెలుస్తుంది.జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ ఈ ఫోటోపై క్లారిటీ ఇచ్చారు.ఈ ఫొటోలో ఎన్టీఆర్ ఆడుకుంటున్న పాప రామ్ ప్రసాద్ మేనకోడలు అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ ఒడిలో ఉంది నా మేనకోడలు అంటూ తారక్ తో దిగిన ఆ ఫోటో షేర్ చేస్తూ తెలిపాడు.దీంతో ఈ పాప ఎవరో అందరికి తెలిసిపోయింది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే.ప్రజెంట్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ).
ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్( Jhanvi Kapoor ) నటిస్తుండగా , విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.సముద్ర నేపథ్యంలో జరగనున్న ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు.కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.