టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ సాయంత్రం 4 గంటలకు తీర్పును వెలువరించనుంది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై ఇరు పక్షాల నుంచి సుదీర్ధ వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ సాయంత్రం తీర్పును వెలువరించనుంది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులోనూ చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈనెల 26 వ తేదీకి వాయిదా పడింది.