భారత్ వేదికగా అక్టోబర్ ఐదు న వన్డే వరల్డ్ కప్( World Cup ) ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే.అయితే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లలోని కీలక ఆటగాళ్లకు గాయాల కారణంగా కాస్త భయం పట్టుకుంది.
వన్డే వరల్డ్ కప్ నాటికి కోలుకుంటే పరవాలేదు కానీ కోలుకోకుంటే జట్లు ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ముఖ్యంగా స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరుగుతూ ఉండడంతో భారత జట్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
భారత జట్టులోని కీలక ఆటగాళ్లయిన పేసర్ బుమ్రా,( Jasprit Bumrah ) స్టార్ ఆటగాళ్లయినా కేఎల్ రాహుల్, ( KL Rahul )శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకొని ప్రపంచ కప్ ముందు జట్టులోకి వచ్చారు.ఇక భారత్ కు తిరుగు ఉండదు అని అనుకునే లోపు శ్రేయస్ అయ్యర్ ను వెన్నునొప్పి మళ్లీ మొదలైంది.
ఒకవేళ జట్టులోకి వచ్చిన మళ్లీ గాయం పేరుతో బయటకు వెళ్లే అవకాశం ఉంది.
మరోవైపు అక్షర పటేల్ కు కూడా గాయాలు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.ప్రపంచ కప్ నాటికి అతను ఫిట్నెస్ సాధిస్తాడా లేదంటే అతని స్థానంలో వేరోకరిని ఆడిస్తాడా అనేది చూడాల్సి ఉంది.
వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనే మిగతా జట్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల కీలక ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా జట్టుకు దూరం అయ్యే పరిస్థితిలు ఉన్నాయి.
విలియం సన్ ఫిట్నెస్ సాధించకపోతే వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా జట్టులోని సీనియర్ పేసర్ సౌథి కూడా గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ ఆడడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.పాకిస్తాన్ జట్టులోని కీలక పేసర్లు నసీం షా, హారిస్ రవుఫ్,( Haris Rauf ) సల్మాన్ అఘా గాయాల పాలయ్యారు. బంగ్లాదేశ్ జట్టులోని కీలక బౌలర్ ఎబాదత్, బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు.
ఈ ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ ప్రారంభమయ్యే లోపు కోలుకోకపోతే జట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.