హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత న్యాయవాదులతో మరి కాసేపటిలో కీలక భేటీ నిర్వహించనున్నారు.ఈడీ నోటీసులపై ఆమె లాయర్లతో చర్చించనున్నారు.
ఈ సమావేశం అనంతరం న్యాయవాదులను కవిత ఢిల్లీకి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.అటు లాయర్లతో భేటీ అనంతరం కవిత ప్రగతిభవన్ కు వెళ్లనున్నారు.
ఈడీ నోటీసులు మరియు తాజా పరిణామాలను సీఎం కేసీఆర్ కు ఆమె వివరించనున్నారు.కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.