యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్”( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను రిలీజ్ చేయడానికి ఎప్పటి నుండో సన్నాహాలు జరుగుతున్నాయి.
మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో తెలిపారు.
కానీ కరెక్ట్ గా సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సినిమా వాయిదా అని రూమర్స్ వచ్చాయి.మరి ఈ రూమర్స్ పై ఎట్టకేలకు ఈ రోజు మేకర్స్ అధికారికంగా స్పందించారు.అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేస్తున్నాం అని అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను మీకు అందివ్వడం కోసం ఈ సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ తెలిపారు.కొత్త రిలీజ్ డేట్ ను ఈ నెలలోనే చెబుతాం అని చెప్పుకొచ్చారు.దీంతో ఈ రూమర్స్ కు క్లారిటీ వచ్చింది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ సినిమా గురించి మరో అప్డేట్ వైరల్ అయ్యింది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్( Netflix ) కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.
అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమా ఎప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో హిట్ అందుకుంటుందో లేదో.