ప్రస్తుతం దేశంలో జమిలి ఎలక్షన్స్ పై ఓ వైపు చర్చ జరుగుతుంటే.కొత్తగా దేశ పెరుమార్పును తెరపైకి తీసుకొచ్చి మరో సంచలనానికి నాంది పలికింది మోడీ ( Narendra Modi )సర్కార్.
దేశానికి ఇండియా పేరును రద్దు చేసి ఆ పదం స్థానంలో భారత్ ని చేర్చాలని మోడీ సర్కార్ భావిస్తోంది.దీనికి ప్రధాన కారణం విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడమే.
దీంతో దేశ పేరు మార్పుపై అడుగులు వేస్తోంది మోడీ సర్కార్.
![Telugu Congress, Jairam Ramesh, Narendra Modi-Politics Telugu Congress, Jairam Ramesh, Narendra Modi-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Narendra-Modi-bjp-party-politics.jpg)
జీ20 సదస్సులో పాల్గొనే నాయకులకు ఆహ్వానించే ఆహ్వాన పత్రికలో ” ది ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా “ స్థానంలో ది ప్రసిడెంట్ ఆఫ్ భారత్ ” అని ప్రస్తావించడంతో పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు కూడా మొదలుపెట్టినట్లు స్పష్టమౌతోంది.అయితే దేశ పేరు మార్చలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 సవరణ చేయాల్సి ఉంటుంది.అందుకు సంబధించిన బిల్ ను ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టె అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.
కాగా దేశ పేరు మార్పుపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి.
![Telugu Congress, Jairam Ramesh, Narendra Modi-Politics Telugu Congress, Jairam Ramesh, Narendra Modi-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Narendra-Modi-bjp-party-politics-brs-Jairam-Ramesh.jpg)
మోడీ( Narendra Modi ) చరిత్రను వక్రీకరిస్తున్నారని, భారతదేశాన్ని విభజించేందుకు ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్( Jairam Ramesh ) తీవ్రంగా మండి పడ్డారు.ఇదిలా ఉంచితే పేరు మార్పుపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1 లో ఇండియా అంటే భారత్ అని స్పష్టంగా రాసిఉండడంతో చిన్న సవరణ ద్వారా దేశ పేరు మార్పు సాధ్యమయ్యేందుకు ఆస్కారం ఉంది.
మరి దీనిపై ఒకవేళ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడితే.విపక్షాల మద్దతు ఎంతవరకు లభిస్తుంది అనేది సందేహమే.మొత్తానికి మోడీ సర్కార్ కు దెబ్బ కొట్టేందుకు విపక్షాలు ప్రణాళిక బద్దంగా కూటమికి ఇండియా పేరు ఎంచుకోగా.ఇప్పుడు ఆ పేరు ను దేశం నుంచే తొలగిస్తూ విపక్షలకు మోడీ ప్రభుత్వం షాక్ ఇస్తోంది.
దీనిపై ముందు రోజుల్లో మరింత రాజకీయ రగడ రాజుకునే అవకాశం ఉంది.మరి ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.