కెనడా( Canada ) కేంద్రంగా చురుగ్గా పనిచేస్తున్న ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద సంస్థలు అక్కడ ఆందోళనలు, రెఫరెండాలు నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 10న ఓ పాఠశాలలో ఖలిస్తాన్ రెఫరెండం( Khalistan Referendum ) జరగాల్సి వుంది.
అయితే ఈ రెఫరెండానికి సంబంధించిన పోస్టర్‌పై ఆయుధాలు, ఉగ్రవాదుల ఫోటోలు వుండటంతో పాఠశాల యాజమాన్యం రెఫరెండాన్ని రద్దు చేసింది.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలో వున్న ‘‘తమనావిస్ సెకండరీ స్కూల్‌లో’’( Tamanawis Secondary School ) ఖలిస్తాన్ రెఫరెండం జరగాల్సి వుంది.
ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ అతికించిన పోస్టర్లపై ఆయుధాలు, తుపాకులు వున్నట్లు స్థానికులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన యాజమాన్యం .ఆ పోస్టర్‌లను తొలగించాల్సిందిగా పలుమార్లు రెఫరెండం నిర్వాహకులను కోరింది.అయినా అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెఫరెండంను రద్దు చేస్తున్నట్లు సర్రే స్కూల్ డిస్ట్రిక్ట్ ఆదివారం ప్రకటించింది.
![Telugu Canadian School, Gurpatwantsingh, Hardipsingh, Khalistan, Sikhs, Surrey, Telugu Canadian School, Gurpatwantsingh, Hardipsingh, Khalistan, Sikhs, Surrey,](https://telugustop.com/wp-content/uploads/2023/09/Canadian-school-cancels-Khalistan-referendum-detailss.jpg)
అద్దె ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు ఈవెంట్‌కు సంబంధించిన ప్రచార సామాగ్రిపై పాఠశాల చిత్రాలు, ఆయుధాల బొమ్మలు వున్నాయని సర్రే స్కూల్ డిస్ట్రిక్ట్‌ను( Surrey School District ) ఉటంకిస్తూ ది ఇండో కెనడియన్ వాయిస్ వెబ్‌సైట్ పేర్కొంది.సమస్యను పరిష్కరించేందుకు పదే పదే ప్రయత్నించినప్పటికీ.ఈవెంట్ నిర్వాహకులు ఈ చిత్రాలను తీసివేయడంలో విఫలమయ్యారని స్కూల్ యాజమాన్యం తెలిపింది.దీనికి తోడు సర్రే అంతటా, సోషల్ మీడియాలోనూ మెటీరియల్‌ను పోస్ట్ చేశారని పేర్కొంది.సదరు పోస్టర్‌లో నిషేధిత ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ (ఎస్ఎఫ్‌జే) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurpatwant Singh Pannun ) పేరుతో కిర్పాన్ (కత్తి), ఏకే 47 తుపాకులు వున్నాయి.
![Telugu Canadian School, Gurpatwantsingh, Hardipsingh, Khalistan, Sikhs, Surrey, Telugu Canadian School, Gurpatwantsingh, Hardipsingh, Khalistan, Sikhs, Surrey,](https://telugustop.com/wp-content/uploads/2023/09/Canadian-school-cancels-Khalistan-referendum-detailsd.jpg)
వీటితో పాటుగా ఈ ఏడాది జూన్‌లో పార్కింగ్ ప్లేస్‌లో హత్యకు గురైన ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్,( Hardip Singh Nijjar ) 1985 ఎయిరిండియా ఫ్లైట్ బాంబు దాడి సూత్రధారి తల్విందర్ సింగ్ పర్మార్‌ల చిత్రాలు కూడా పొందుపరిచారు.కెనడాలోని భారతీయ మిషన్‌లు, దౌత్యవేత్తలను బెదిరించే ఖలిస్తానీ అనుకూల పోస్టర్లు ఇటీవలి కాలంలో కనిపించిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.సెప్టెంబర్ 8న వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను లాక్‌డౌన్ చేయాలని కెనడా వ్యాప్తంగా వున్న ఖలిస్తాన్ గ్రూపులకు గురుపత్వంత్ పిలుపునిచ్చాడు.