సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తలలో నిలుస్తున్నటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన సినీ సెలెబ్రెటీల జాతకాలు గురించి అలాగే రాజకీయ నాయకుల జాతకాల గురించి చెబుతూ వార్తలు నిలుస్తున్నారు.
అయితే ఈయన చెప్పిన జాతకం చెప్పిన విధంగానే జరగడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఇప్పటికే హీరోయిన్ల గురించి అలాగే హీరోల గురించి ఎన్నో విషయాలను ఈయన తెలియజేశారు.
ఇక టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మరో ఉదయ్ కిరణ్ అవుతారు అంటూ ఈయన ప్రభాస్ గురించి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.ఇలా ఇప్పటికే పలువురు సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పినటువంటి వేణు స్వామి తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) జాతకం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ జాతకం గురించి వేణు స్వామి మాట్లాడుతూ…
అల్లు అర్జున్ జాతకం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు.ఈయన మీద ఏ నిర్మాత అయిన ₹10 పెట్టుబడి పెడితే వంద రూపాయలు తప్పకుండా సంపాదిస్తారని తెలిపారు.అయితే ఈయన జాతక ప్రభావం మరో 10 సంవత్సరాల పాటు ఇలాగే ఉంటుందని, సినిమాలపరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ హీరో అనే పేరు సంపాదించుకుంటారు అంటూ వేణు స్వామి అల్లు అర్జున్ జాతకం గురించి తెలిపారు.ఇలా అల్లు అర్జున్ జాతకం కెరియర్ పరంగా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.