సందీప్ కిషన్( Sandeep Kishan ) హీరో గా వచ్చిన ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ రాజసింహ( Rajasimha )…ఈయన చేసిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఆయన ఇంకో సినిమా డైరెక్షన్ చేయలేదు కారణం ఆయన డైరెక్టర్ కి ఉండాల్సిన మెళుకువలు తను కొన్ని మిస్ అవుతున్నాడు అనుకొని వాటిని నేర్చుకోవాలని అనుకొని డైరెక్షన్ చేయకుండా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు.ఇక ఇదే టైం లో ఆయన జి నాగేశ్వర రెడ్డి, సందీప్ కిషన్ కాంబో లో వచ్చిన తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే సినిమా కి కథ అందించాడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో ఆయన మరి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఒక మంచి స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు డైరెక్షన్ చేసి ఒక మంచి హిట్ సినిమా తీయాలని ఆయన చాలారోజుల నుంచి కలలు గన్న తన కలలు నెరవేర్చు కోవాలని ఆయన చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఆయన ప్రస్తుతం గోపిచంద్ కి ఒక కథ చెప్పి ఒప్పించినట్లుగా తెలుస్తుంది…నిజానికి ఈయన ఎప్పుడో ఒక మంచి డైరెక్టర్ గా ఎదగాల్సింది కానీ ఆయనకి మంచి అవకాశాలు రాకపోవడం తో ఆయన చాలా భాదపడి వెనకబడి పోయారని చెప్పాలి.ఇక ఈ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీ లో తనుకూడ ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీసి తన స్టామినా ఏంటో ఇండస్ట్రీ కి ప్రేక్షకులకి చూపించాలని తను చూస్తున్నాడు…చూడాలి మరి ఆయన చేసిన సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తారా లేదా అనేది…