దేశంలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.ఈ ఏడాది ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections )మరియు వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలపాటు మరికొన్ని రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు.
ఇలా దేశమంతా కూడా ఎలక్షన్ హీట్ గట్టిగానే కనిపిస్తోంది.కాగా ఈసారి అధికారంపై ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు.
ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ( BJP party )సర్కార్ మరోసారి అధికారంపై కన్నెసింది.ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ మూడోసారి అంతకు మించి అనేలా ఏకంగా 300 పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని చెబుతోంది.
అటు ప్రతిపక్షాలు కూడా ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని గట్టి పట్టుదలగా ఉన్నాయి.
ఇప్పటికే ఇండియా కూటమి పేరుతో విపక్షాలన్నీ ఏకమై ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదేవరు అనేది అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న.తాజాగా పంద్రాగస్ట్ సందర్భంగా మోడీ ( Narendra Modi )చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఎర్రకోటపై జెండా ఎగురవేసిన తరువాత ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచి నెక్స్ట్ ఆగష్టు 15 కు కూడా ప్రధానిగా జెండా ఎగురవేస్తానని మోడీ వ్యాఖ్యానించారు.
అయితే మోడీ వచ్చే ఎన్నికలపై పగటి కలలు కంటున్నారని, ఆయనను ప్రజలు ఇంటికే పరిమితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కాగా కాంగ్రెస్ నేత మాజీ పిఎం మన్మోహన్ సింగ్( Manmohan Singh ) తరువాత వరుసగా పది సార్లు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన కాంగ్రెసేతర నేతగా మోడీ నిలిచారు.మరి వచ్చే ఆగష్టు 15 కు ప్రధానిగా ఎవరు జెండా ఎగుర వేస్తారో చూడాలి.ఇక తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మోడీకి సానుకూలతతో పాటు వ్యతిరేకత కూడా గట్టిగానే ఉంది.ఇటీవల జరుగుతున్నా మణిపూర్ అల్లర్ల అంశం మోడీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.
ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఇటు బిఆర్‌ఎస్ నుంచి కేసిఆర్ వంటి వారు మోడీకి గట్టి పోటీనిచ్చే దిశగా ముందుకు దూసుకొస్తున్నారు.మరి వచ్చే ఆగష్టు 15 కు ప్రధానిగా జెండా ఎగురవేస్తానని చెబుతున్నా మోడీ చేసిన వ్యాఖ్యలు పగటి కలల్లా మిగిలి పోతయా లేదా నిజం అవుతాయా అనేది చూడాలి.