జబర్దస్త్ ( Jabardast )వల్ల చాలామందికి మంచి అవకాశాలు వస్తున్నాయి.జబర్దస్త్ లో కొద్దిగా టాలెంట్ చూపిస్తే చాలు వారికి సినిమా ఛాన్స్ లు లేదా మరో ఛానెల్ లో షోస్ కూడా వస్తాయి.
అయితే కొద్దిపాటి టాలెంట్ ఉందని గుర్తిస్తేనే మరో ఛాన్స్ అందుకుని ఎగిరిపోతుంటారు.అయితే అది కొంతమందికి మాత్రమే అని తెలుస్తుంది.
ముఖ్యంగా జబర్దస్త్ లో కొంతమంది అన్ని విధాలుగా పాపులర్ అవుతున్నా వారికి మాత్రం బయట అవకాశాలు లేవు.ఈ క్రమంలో జబర్దస్త్ ఐశ్వర్య ( Aishwarya )కి మంచి పాపులారిటీ వచ్చినా ఆమెను ఎందుకో వెనక్కి నెట్టేస్తున్నారని అనిపిస్తుంది.
జబర్దస్త్ లో గ్లామర్ ఇమేజ్( Glamor image ) తెచ్చుకున్న వారిలో ఐశ్వర్య ఒకరు.అనసూయ( Anasuya ) వెళ్లాక జబర్దస్త్ లో గ్లామర్ తగ్గింది అనుకునే టైం లో రీసెంట్ గా ఐశ్వర్య బాగానే ఆడియన్స్ ని అలరిస్తుంది.ఆమెకు వచ్చిన ఈ క్రేజ్ పెంచుకోవాలని ఐశ్వర్య ప్రయత్నిస్తున్నా సరే ఆమెకు సరైన అవకాశాలు మాత్రం ఇవ్వట్లేదు.అంతేకాదు రాఘవ టీం లో తప్ప ఆమె మిగతా టీం లో కనిపించినట్టు లేదు.
ఆమధ్య ఆమె ఓ సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి మరి అదేమైందో కూడా తెలియదు.జబర్దస్త్ లో వచ్చిన ఈ పేరుతో ఐశ్వర్య బయటకు వచ్చి సినిమాలో వెబ్ సీరీస్ లో చేస్తే మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది.