బుట్ట బొమ్మ( butta bomma ) పూజా హెగ్దేకి గుంటూరు కారం తర్వాత మరో సినిమా ఛాన్స్ రాలేదు.అయితే మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో ఆమె అవకాశం దక్కించుకుందని వార్తలు వచ్చాయి.
టైర్ 2 హీరోగా రవితేజ( raviteja ) తో నటించిన హీరోయిన్స్ కి సూపర్ క్రేజ్ ఉంటుంది.అయితే పూజా హెగ్దే కి అవకాశాలు లేని టైం లో రవితేజ సినిమా మేకర్స్ పిలిచి అవకాశం ఇస్తానని చెప్పినా అమ్మడు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గనని చెబుతుందట.
హీరో ఎవరన్నది కాదు.బడ్జెట్ ఎంతన్నది కాదు మార్కెట్ లో తనకు ఇస్తున్న రెమ్యునరేషన్ ఏమాత్రం తగ్గకుండా ఇస్తేనే సినిమా చేస్తానని అంటుందట పూజా.ఈమధ్య పూజా హెగ్దే( pooja hegde ) రెమ్యునరేషన్ తగ్గించింది అన్న వార్తలు రాగా వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది.రవితేజ గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమా పడితే మాత్రం టైర్ 2( tier 2 ) హీరోలతో పూజా కెరీర్ మళ్లీ బిజీ అవుతుందని చెప్పొచ్చు.మరో హిట్ పడితే కానీ పూజా తెలుగులో బిజీ అయ్యే అవకాశం ఉంటుంది.
రవితేజ సినిమా అంటే పూజా హెగ్దేకి లక్కీ ఛాన్స్ అనే చెప్పొచ్చు.