తెలుగు ప్రేక్షకులకు తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల( Sobhita Dhulipala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ఈ ముద్దుగుమ్మ రామన్ రాఘన్ 2.0 అనే ఒక హిందీ సినిమాతో వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత గూడచారి సినిమా( Goodachari )తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అయితే ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ హీరోయిన్ శోభితకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపు నాలుగేళ్లకు మేజర్ సినిమాతో మళ్లీ తెలుగు తెరపై కనిపించింది.
ఆ తర్వాత మధ్య మధ్యలో హిందీ మలయాళ సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ప్రస్తుతం ఈమె హాలీవుడ్‌లో మంకీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తోంది.ఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో అందరి మాదిరిగానే శోభిత కూడా కెరియర్ ఆరంభంలో కొన్ని చేదు సంఘటనలను ఎదుర్కొందట.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఆ విషయాల చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ.ఒక్కసారి గడప దాటి బయటకు వచ్చావంటే యుద్ధం చేయాల్సిందే! ఎందుకంటె నాకు ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు.
నాకు ఇప్పటికీ గుర్తు వాణిజ్య ప్రకటనల ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు చాలాసార్లు అందంగా లేనని ముఖం మీదే చెప్పి రిజెక్ట్ చేశారు.
నేను కూడా అద్దంలో నన్ను నేను చూసుకుని కాస్తంత అందంగా కూడా లేనని అనుకునేదాన్ని.అయినప్పటికీ ఏదో ఒక కమర్షియల్ డైరెక్టర్ మనల్ని వెతుక్కుంటూ వస్తాడని ఎప్పుడూ ఊహల్లో తేలిపోలేదు.అయితే నాకు తెలిసిందల్లా ఒక్కటే ఆడిషన్స్‌కు వెళ్లడం, 100% ఎఫర్ట్ పెట్టడం! అని చెప్పుకొచ్చింది శోభిత ధూళిపాళ.
ప్రస్తుతం ఈమె చేసిన వాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.కదా శోభిత చివరగా ఇటీవలే మణిరత్నంతో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2( Ponniyin Selvan: II ) సినిమాలో నటించింది.మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్యే ద నైట్ మేనేజర్ అనే సిరీస్‌తో అలరించింది.