టిడిపి మహానాడు ! చేయబోయే తీర్మానాలు ఇవే

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అలర్ట్ అవుతుంది.రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఏ ఏ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలనే విషయంపై సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.

 Tdp Mahanadu! These Are The Resolutions To Be Made ,tdp, Chandrababu, Jagan, Tdp-TeluguStop.com

ఇక తెలుగుదేశం పార్టీ( TDP ) మహానాడు రేపు ,ఎల్లుండి నిర్వహించనున్న నేపథ్యంలో ఈ మహానాడులోనే కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనుంది.అందుకే ఈ మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా భారీగా ఏర్పాట్లు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కడియం మండలం వేమగిరిలో ఈ మహానాడు ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు .వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో నెలకొన్న విపల్యలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే ధ్యేయంగా టిడిపి మహానాడులో 15 తీర్మానాలను చేయనుంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Lokesh, Tdp Mahanadu-Politics

బాదుడే బాదుడు పేరుతో ఆర్థికంగా రాష్ట్రాన్ని కుంగదీస్తూ మోసకారి సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం( YCP ) అమలు చేస్తుందని టిడిపి మహానాడులో తీర్మానం చేయనుంది .రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అండగా నిలబడదామనే భరోసాతో మరో తీర్మానం చేయనున్నారు .అలాగే యువతలో నూతన ఉత్సాహాన్ని కలిగించే విధంగా వారిలో భరోసా నింపే విధంగా యువ గళం పాదయాత్ర సాగుతున్నందున ,  టిడిపి అధికారంలోకి రాగానే దేశాభివృద్ధిలో కీలకమైన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తామని తీర్మానం చేయనున్నారు.అమరావతి ఎలక్ట్రానిక్ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగోడుతున్నారంటూ మరో తీర్మానాన్ని చేయనున్నారు.సి ఆర్ డి ఏ చట్టానికి విరుద్ధంగా సెంటు పట్టా పేరుతో ఎలక్ట్రానిక్ సిటీని ధ్వంసం చేస్తే లక్షలాది పేద పిల్లలకు మంచి ఉద్యోగాలు ఎలా వస్తాయని మహానాడు వేదికగా టిడిపి ప్రశ్నించనుంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Lokesh, Tdp Mahanadu-Politics

మంచి ఉద్యోగాలు లేకుండా పేదలు , నిరుపేదలుగా ఉండిపోవడమే జగన్ రెడ్డి( YS Jagan Reddy ) కోరుకుంటున్నారా అని ఈ మహా నాడులో నిలదీయాలని నిర్ణయించుకుంది.పోలవరం, అమరావతి నిర్లక్ష్యంతో పాటు సహజ వనరుల దోపిడీ , ఆర్థిక సంక్షోభం, అవినీతి వంటి వ్యవహారాలపై మహానాడులో తీర్మానాలను చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube