Bandla Ganesh Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ పరువు పోయేలా బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్లు.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు నటుడు నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బండ్ల గణేష్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 Bandla Ganesh Shocking Tweet On Trivikram Srinivas-TeluguStop.com

తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు ( Politics ) సంబంధించిన విషయాలలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు బండ్లన్న.

ఇది ఇలా ఉంటే బండ్ల గణేష్ కు అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు( Trivikram Srinivas ) మంచి బాండింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.

తీన్ మార్ సినిమా నుంచి ఆ బాండింగ్ అలాగే కొనసాగుతూనే వుంది.ఇది ఇలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.సోషల్ మీడియాలో ఒక నెటిజన్ బండ్ల గణేష్ ని నిర్మాత కావాలని ఉంది అని అడగగా ఆ కామెంట్ పై స్పందించిన బండ్ల గణేష్ గురూజీని కలవడం,భారీ గిఫ్ట్ ఇవ్వండి… నెరవేరుతుంది అని రాసుకొచ్చాడు.

అయితే గురూజీ అంటే అర్థం త్రివిక్రమ్.

గతంలో చాలాసార్లు బండ్ల గణేష్ త్రివిక్రమ్ ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.తాజాగా బండ్ల గణేష్ మరోసారి త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేయడంతో అధికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

కాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube