Bandla Ganesh Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ పరువు పోయేలా బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్లు.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు నటుడు నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బండ్ల గణేష్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు ( Politics ) సంబంధించిన విషయాలలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు బండ్లన్న.
ఇది ఇలా ఉంటే బండ్ల గణేష్ కు అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు( Trivikram Srinivas ) మంచి బాండింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.
"""/" /
తీన్ మార్ సినిమా నుంచి ఆ బాండింగ్ అలాగే కొనసాగుతూనే వుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సోషల్ మీడియాలో ఒక నెటిజన్ బండ్ల గణేష్ ని నిర్మాత కావాలని ఉంది అని అడగగా ఆ కామెంట్ పై స్పందించిన బండ్ల గణేష్ గురూజీని కలవడం,భారీ గిఫ్ట్ ఇవ్వండి.
నెరవేరుతుంది అని రాసుకొచ్చాడు.అయితే గురూజీ అంటే అర్థం త్రివిక్రమ్.
"""/" /
గతంలో చాలాసార్లు బండ్ల గణేష్ త్రివిక్రమ్ ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా బండ్ల గణేష్ మరోసారి త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేయడంతో అధికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.కాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?