ఏపీలో పొత్తుల అంశమే హాట్ టాపిక్ గా మారింది.రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉన్నాయి.
బీజేపీ నీ కలుపుకు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తుండగా, టిడిపి సైతం బిజెపి విషయంలో అదే ఆలోచనతో ఉంది.కానీ బిజెపి మాత్రం ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
ఏపీ బీజేపీలో కీలక నేతలుగా ఉన్నవారు మాత్రం టిడిపితో పొత్తు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అయినా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బిజెపి ( BJP )అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చిందని, ఖచ్చితంగా ఏపీలో జనసేన, టిడిపి( Jana sena ) లు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతుండగా, ఈ పొత్తులపై ఇప్పుడు వామపక్ష పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.
జనసేన టిడిపి మాత్రమే పొత్తు పెట్టుకోవాలని, బిజెపితో కలవద్దని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో సిపిఐ, సిపిఎం ( CPM )పార్టీల పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.గతంలో కంటే ఇప్పుడు బాగా బలహీనపడడం, ఒంటరిగా ఎక్కడా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేకపోవడంతో, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఒకటి రెండు స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయి.అది తప్ప మరో ఆప్షన్ ఆ పార్టీలకు కనిపించడం లేదు.
దీంతో జనసేన టిడిపిల మధ్య పొత్తు కుదిర్చే బాధ్యతలను వామపక్ష పార్టీలు తీసుకుంటున్నాయి.ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే దాంట్లో భాగస్వామ్యం అయితే బిజెపి దూరమవుతుందని వామపక్ష పార్టీలు ఆశపడుతున్నాయి.
అందుకే పొత్తుల చర్చల కోసం దొరికిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వామపక్ష పార్టీలు వాడేసుకునే పనిలో ఉన్నాయి. గతంలో టిడిపి జనసేనతో కలిసి పనిచేసిన అనుభవం వామపక్ష పార్టీలకు ఉండడంతో, ఆ రెండు పార్టీలకు మళ్ళీ దగ్గర అయ్యే సంకేతాలను పంపిస్తున్నాయి.
ముఖ్యంగా టిడిపి, జనసేన మద్య పొత్తుకుదురే విధంగా తామే చొరవ తీసుకుని రెండు పార్టీలను దగ్గర చేస్తే, ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని భావిస్తున్నాయి.
అలాగే టిడిపి, జనసేన మాత్రమే కాకుండా బిజెపి కూడా ఆ రెండు పార్టీలతో కలిస్తే ఇక ఒంటరిగా పోటీ చేయక తప్పదని, కానీ పోటీ చేసినా, గెలిచే పరిస్థితి లేదనే ఆందోళన వామపక్ష పార్టీల్లో కనిపిస్తోంది.అందుకే టిడిపి ,జనసేన విషయంలో అంత ఆత్రుతగా ప్రయత్నాలు చేస్తుంది.