ఐస్‌క్రీమ్( ICDE cream ) పేరు చెబితే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ నోటిలో నీళ్లు ఊరుతాయి.అందులోనూ వేసవి కాలం అంటే మరీను… చల్లచల్లని ఐస్‌క్రీమ్ నోట్లో వేసుకోవాలని ఆహుతులు కోరుకోరు? అయితే సాధారణంగా మీరు ఒక్కో ఐస్‌క్రీమ్ కి ఎంత వెచ్చిస్తారు? పదో, పాతికో.మహా అయితే ఓ 100 రూపాయిలు పెట్టి కొనుక్కుంటూ వుంటారు.ప్రత్యేకమైనదైతే ఓ 500 రూపాయిలో 1000 రూపాయితో ఉంటుంది.అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఐస్‌క్రీం తినాలంటే మాత్రం మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

అవును, జపాన్‌లో( JAPAN ) అమ్మే ఈ ఐస్‌క్రీమ్ ధర అక్షరాలా రూ.5.2 లక్షలు అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోయినా ఇది నిజం.ఈ ఐస్‌క్రీమ్‌లో అంత స్పెషల్ ఏముంది అని ఆశ్చర్యపోతున్నారు కదూ.జపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ సెలాటో( Ice Cream Brand Selato ) ఈ ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్ వెరైటీని తయారుచేసింది.అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ డెజర్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా సరికొత్త రికార్డు సాధించింది.తద్వారా ఈ ప్రత్యేక ఐస్‌క్రీమ్‌ను 8,73,400 జపనీస్ యెన్ అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.5.2లక్షల చొప్పున విక్రయిస్తోంది సదరు కంపెనీ.

ఇక దీని తయారీలో ఉపయోగించిన ‘వైట్ ట్రఫుల్’ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించారట.ఈ ట్రఫుల్ ధర కిలోకు 2 మిలియన్ జపనీస్ యెన్‌లు.ఆల్బాలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు.
దీనివల్లే ఈ ఐస్‌క్రీమ్ ధర ఇంతగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.దీంతో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్, సేక్ లీస్ అనే వైట్ సాస్ వంటి పదార్థాలు వాడినట్టు తెలుస్తోంది.
దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఈ డెజర్ట్ గిన్నిస్ రికార్డు సాధించింది.







