వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు( Chandrababu naidu ) భారీ స్కెచ్ వేస్తున్నారా ? వైసీపీ అసంతృప్త నేతలే టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తున్నారా ? అంటే అవుననే సమాధానం ఏపీ పోలిటికల్ సర్కిల్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది.వైసీపీని దెబ్బతీసేందుకు ఏ చిన్న అవకాశం దొరికిన ఏ మాత్రం వదలకుండా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు చంద్రబాబు.
ఇప్పటికే జనసేనతో పొత్తును దాదాపు కన్ఫర్మ్ చేసుకొని వైసీపీకి కునుకు లేకుండా చేస్తున్నారు.ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్రణాళికతో వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగమే వైసీపీ రెబెల్ నేతలను టీడీపీ గూటికి చేర్చడం.ఈ మద్య వైసీపీలో అసంతృప్తి గళం వినిపించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
ఆనం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి రాజమోహన్ రెడ్డి.ఇలా పలువురు నేతలు వైసీపీకి రెబెల్స్ గా మారి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.వీళ్ళు ఇతర పార్టీల వైపు చూడకుండా టీడీపీ గూటికే చేరేలా బాబు ప్రణాళికలు రచించరాట.ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్ లోనే వీళ్ళు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ఈ నలుగురిని చంద్రబాబు ఆకర్షించడాని ఆ టైమ్ లో వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నికల నాటికి వీరు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది.
ఇక ఎప్పటినుంచో వైసీపీకి రెబెల్ గా( Raghu Rama Krishna Raju ) మారి ఆ పార్టీకి కొరకరాని కొయ్యల మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా టీడీపీలో చేరతారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.ఎన్నికల నాటికి ఈయన కూడా టీడీపీ గూటికి చేరిన ఆశ్చర్యం లేదు.ఇక తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైసీపీ పై అసంతృప్తిగా ఉన్నారు.
దాంతో ఈయనను కూడా లాక్కునేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.ఒకవేళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా టీడీపీ వైపు చూస్తే వైసీపీకి గట్టి దెబ్బ తగిలినట్లే.ఇంకా రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి చాలమంది ఎమ్మేల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినవారు చెబుతుండడంతో చంద్రబాబు పక్కా ప్రణాళిక బద్దంగా వారంతా టీడీపీ వైపే చూసేలా వ్యుహాలు రచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిస్ల్ లో గుసగుసలు నడుస్తున్నాయి.ఎందుకంటే జనసేన ఆల్రెడీ టీడీపీతో పొత్తుకోసం ప్రయత్నిస్తోంది.
అటు బీజేపీకి ఏపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు.దాంతో బయటకు వస్తున్న నేతలకు టీడీపీ తప్పా వేరే ఆప్షన్ లేదు.
ఇలా మొత్తానికి వైసీపీ రెబెల్స్ టార్గెట్ గా చంద్రాబాబు వెస్తోన్న స్కెచ్.జగన్( YS Jagan Mohan Reddy ) కు చెక్ పెట్టె దిశగా సక్సస్ అవుతుందో లేదో చూడాలి.
.