సూర్యాపేట జిల్లా: పులిచింతల నిర్వాసితుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ సమక్షంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం,రెండు రాష్ట్రాలు కూర్చున్నప్పుడు ఈ సమస్యలపై పక్కన ఆంధ్రా రాష్ట్రానికి తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుధవారం హుజూర్ నగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పులిచింతల ప్రాజెక్టు రివ్యూ మీటింగ్ లో పలు అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్.
వెంకట్రావుతో కలిసి రెవెన్యూ,పలు శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో పులిచింతల నిర్వాసితుల సమస్యలతో పాటు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధిపై కూడా చర్చించారు.
అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే పులిచింతల నిర్వాసితులకు ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ సెంటర్ కూడా అభివృద్ధి చెందిందన్నారు.
పులిచింతల నిర్వాసిత మార్కు కంటే కూడా ఇంకా ఇప్పుడు స్టోరేజ్ పెరగడంతో కొందరి భూమి కూడా నీట మునుగుతుండడంతో ఆ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలిపారు
.