తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు.ఈ మేరకు నిరంజన్ రెడ్డి ఈడీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
చైనాలో మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్ రెడ్డి రెగ్యులర్ గా మాట్లాడేవారని రఘునందన్ రావు ఆరోపించారు.ఆ వ్యక్తి అమెరికాలో ఉన్న మరో వ్యక్తితో సంప్రదింపులు జరిపేవాడన్నారు.
ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి, మో లావాదేవీలపై విచారణ జరపాలని కోరుతానని పేర్కొన్నారు.అదేవిధంగా దత్తపుత్రుడు గౌడ నాయక్ పై కూడా ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.