ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ అంటే ఇప్పుడు తెలియని వారు లేరు అంటే అతియసోక్తి కాదేమో.ఎందుకంటే ఈయన పుష్ప ది రైజ్ సినిమాతో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు.
ఇక ఈ సినిమా పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.అప్పుడు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సంచలన కలెక్షన్స్ సాధించింది.
అందుకే ఈసారి ముందు నుండే భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమా సీక్వెల్ ను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్”.పార్ట్ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పార్ట్ 1 కంటే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో పార్ట్ కూడా ఉంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారట.ఇప్పటికే మేకర్స్ పార్ట్ 3 (Pushpa 3) ను కూడా లాక్ చేసారని తెలుస్తుంది.దీంతో పార్ట్ 3 పక్కాగా రానున్నట్టు తెలుస్తుంది.
సుక్కూ మూడవ పార్ట్ ను మరింత అద్భుతంగా సిద్ధం చేయనున్నారట.అయితే ప్రెజెంట్ ఈయన ద్రుష్టి మొత్తం పార్ట్ 2 మీద ఉందని ఇది రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 3పై ద్రుష్టి పెట్టనున్నట్టు టాక్.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ అందరిని ఆకట్టు కున్నాయి.బాలీవుడ్ లో అయితే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ లభించింది.ఇక రష్మిక మందన్న (Rahsmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.