జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం బయటపడింది.ఓ మహిళకు సర్జరీ చేసిన డాక్టర్స్ కడుపులో క్లాత్ మరిచి పోయారు.
గత 16 నెలల క్రితం డెలివరీ కోసం నవ్య శ్రీ అనే మహిళ ఆస్పత్రికి వచ్చింది.దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో క్లాత్ ఉంచి కుట్లు వేశారు.
డెలివరీ తరువాత నుంచి కడుపునొప్పితో నవ్య శ్రీ బాధపడుతుంది.ఈ క్రమంలోనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా కడుపులో క్లాత్ ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం సర్జరీ చేసి క్లాత్ ను బయటకు తీశారు.