వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థి ప్రీతి తుది శ్వాస విడిచింది.గత ఐదు రోజుల నుండి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేయడం జరిగింది.
మెడికో ప్రీతిని కాపాడటానికి వైద్య బృందం శతవిధాల ప్రయత్నాలు చేయడం జరిగింది.ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నా గాని… ప్రీతిని మరణం నుండి కాపాడలేకపోయారు.
కుమార్తె మరణించడంతో తల్లిదండ్రులు మరియు స్నేహితులు… కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు.అంతకుముందే ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు.
అయినా గాని చికిత్స కొనసాగుతుందని… సందేహంగానే ఉందని…అన్నారు.రోజురోజుకీ ప్రీతి ఆరోగ్యం క్షీణించడంతోపాటు శరీర రంగు కూడా మారుతుందనీ తండ్రి నరేంద్ర కొద్దిరోజుల క్రితమే విచారం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఐదు రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి… ఆదివారం తుది శ్వాస విడవటం జరిగింది.ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం.
శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తూ ఉంది.ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే శాఖలో ఏఎస్ఐగా పని చేస్తున్నారు.
హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.నరేందర్ మూడో కుమార్తె ప్రీతి.